Home News Politics

ఆంధ్రాలోనూ అదే రాజ‌కీయం

రాజ‌కీయాల‌పై అశోక్‌బాబు ఆశ‌

SHARE

అశోక్‌బాబు. ఏపీఎన్జీవోల సంఘం నేత‌. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అంద‌రి నోళ్ల‌లో నానిందీ పేరు. తెలంగాణ ఉద్య‌మంలో స‌క‌ల‌జ‌నుల‌తో పాటు ఉద్యోగ‌సంఘాలు కూడా తెగించి కొట్లాడిన స‌మ‌యంలో..స‌మైక్యాంధ్ర ఉద్య‌మంతో తెర‌పైకొచ్చారు అశోక్‌బాబు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ముఖ్య‌మంత్రి మ‌న‌సెరిగి విధేయుడిగా ఉంటున్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ధ‌ర్మ‌పోరాటం మొద‌ల‌య్యాక‌.. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ఉద్యోగుల్ని కూడా అందులో భాగ‌స్వాముల్ని చేస్తున్నారీ ఎన్జీవోల‌సంఘం నేత‌.

విభ‌జ‌న స‌మ‌యంలో రాష్ట్ర‌కోసం పోరాడ‌టం వేరు. కానీ ఇప్పుడు అశోక్‌బాబు రాజ‌కీయం రాష్ట్రం స‌రిహ‌ద్దులు కూడా దాట‌డ‌మే విశేషం. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అక్క‌డి తెలుగు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారో లేదో…బెంగ‌ళూరులో వాలిపోయారు అశోక్‌బాబు. ఉద్యోగ‌సంఘాల నేత క‌ర్ణాట‌క‌కు వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డాన్ని బీజేపీ నేత‌లు ఆక్షేపించ‌డ‌మే కాదు గ‌వ‌ర్న‌ర్‌కి కూడా ఫిర్యాదుచేశారు.

ర్వీస్ రూల్స్ త‌న‌కూ తెలుసంటూనే బీజేపీ ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేసిన అశోక్‌బాబు హోదా ఉద్య‌మంకోసం అవస‌ర‌మైతే ఉద్యోగం వ‌దిలేయ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కోసం సారువాడు పెద్ద ప్లానే వేశార‌న్న‌మాట‌. తెలంగాణ‌లో టీఎన్జీవో నేత శ్రీనివాస‌గౌడ్ ఎమ్మెల్యే అయిపోయారు. మిగిలిన ఉద్యోగ‌సంఘాల నాయ‌కులు కూడా ఏదో ర‌క‌మైన ప్ర‌యోజ‌నాలు పొందారు. ఇప్పుడు ఏపీఎన్జీవో నేత‌కు కూడా వారే స్ఫూర్తి.

విభ‌జ‌నకు ముందునుంచీ ఉద్యోగుల ప‌రంగా అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్న అశోక్‌బాబుపై టీడీపీ అధినేత‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంది. అశోక్‌బాబు కోరుకోవాలేగానీ ఆయ‌న‌కోసం ఓ సీటు దొర‌క్క‌పోదు. పైగా సామాజిక‌ప‌రంగా కూడా మ‌నోడేన‌న్న సాఫ్ట్ కార్న‌ర్ ఉండ‌నే ఉంటుంది. సో..అశోక్‌బాబు పూర్తిస్థాయి రాజ‌కీయ‌నాయ‌కుడిగా రూపాంత‌రం చెందే రోజు మ‌రెంతో దూరంలో లేద‌న్న‌మాట‌.