Home News Politics

ఆందోల్ లో త్రిముఖ పోరు…దామోదర నిలిచేనా..!

SHARE

ఆందోల్ నియోజకవర్గం ముక్కోణపు పోరుకు వేదికైంది. పార్టీలు మారినా… స్వతంత్రులుగా నిలిచినా… ఒక సారి ఓడినా.. మరో సారి గెలిపించి అక్కున చేర్చుకొని అన్ని ప్రధాన పార్టీలనూ ఆదరించింది అందోలు నియోజకవర్గం. ఒక్కో అభ్యర్థి పలుమార్లు గెలిచారు. పలుమార్లు ఓడారు. ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.తాజా ఎమ్మెల్యే బాబుమోహన్ ,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ,జర్నలిస్టు క్రాంతి కిరణ్ మద్య తీవ్ర పోటి నెలకోంది. ఎన్నికల్లో గెలుపు ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మకంగా మారింది.ఆందోల్ రాజకీయ ముఖచిత్రం పై తెలుగుపాపులర్ టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్…

ఇక్కడ 2014 మినహా మిగతా ఎన్నికల్లో టీడీపీ,కాంగ్రెస్ పార్టిల మద్యే ప్రధాన పోటి నెలకొంది.ఎస్సీ రిజర్వ్ డ్ అయిన ఆ నియోజకవర్గం నుంవి 1989,2004,2009 ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ తరుపున గెలుపొందగా ..బాబుమోహన్ 1998,1999 ఎన్నికల్లో టీడీపి తరుపున గెలుపొందారు.1998 నుంచి 2014 వరకు రాజనర్సింహ ,బాబుమోహన్ మద్యే ప్రధాన పోరు నెలకొంది.ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్ధి బాబుమోహన్ కు గులాబీ పార్టీ టిక్కెట్ నిరాకరించింది. ఆయన స్ధానంలో జర్నలిస్టు క్రాంతికిరణ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది.దీంతో బాబుమోహన్ బీజేపీ తరపున రంగంలోకి దిగనున్నారు.

ఇక్కడ బాబూమోహన్ గెలిస్తే పార్టి కాదు వ్యక్తి ముఖ్యమనే సంకేతాలు వెళ్తాయి. క్రాంతికిరణ్ గెలిస్తే వ్యక్తి కన్నా పార్టినే ముఖ్యమనే సంకేతాలు వెళతాయి.ఈ ఎన్నికలు దామోదర రాజనర్సింహకు ప్రతిష్టాత్మకంగా మారాయి.ఓడితే పరిస్ధితి దారుణంగా మారే అవకాశం ఉంది.1989,2004,2009 ఎన్నికల్లో గెలుపొందిన రాజనర్సింహ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్నరు.భార్య పద్మినిరెడ్డి బీజేపీలో చేరిక తిరిగి అదేరోజు సొంత గూటికి రాక లాంటి నాటకీయ పరిణామాలు రాజనర్సింహని కొంత కలవరపాటుకి గురి చేశాయి.

2014 ఎన్నికల్లో అనూహ్యంగా బాబూమోహన్ చేతిలో దామోదర అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.దీంతో ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నరు. ఇక క్రాంతికిరణ్ అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నరు .స్ధానికుడు కావడం ఈయనకు కలిసోచ్చే అంశంగా చెబుతున్నరు. నాలుగన్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పధకాలు తనను గెలిపిస్తాయనే ధీమాతో క్రాంతి ఉన్నారు.

ప్రస్థుత రాజకీయన్ని పరిశీలిస్తే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన దామోదర రాజనర్సింహకి కొంత అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అయితే కమలం పార్టీ నుంచి బాబుమోహన్ బరిలో దిగుతుండటం ఆయన ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తారా లేక టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలుస్తారా అన్నది కూడా ఇక్కడ కీలకం కానుంది.