Home Entertainment Cinema

క్రేజీ ప్రాజెక్ట్ లో అనసూయ…! ఆ బయోపిక్ లో అవకాశం కొట్టేసిన యాంకర్

క్రేజీ ప్రాజెక్ట్ లో అనసూయ...! ఆ బయోపిక్ లో అవకాశం కొట్టేసిన యాంకర్

SHARE


రంగస్థలం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఓ బయోపిక్ లో అవకాశం కొట్టేసింది. అది మరేదో కాదు. వైఎస్ పై వస్తున్న బయోపిక్. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

క్రేజీ ప్రాజెక్ట్ లో అనసూయ…! ఆ బయోపిక్ లో అవకాశం కొట్టేసిన యాంకర్

మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో అనసూయ రాయసీమ నేతగా దర్శనమివ్వనున్నారు. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని చేయనున్నారు. వైఎస్ ఆత్మగా పాపులర్ అయిన కీవీపీ పాత్రలో రావు రమేష్ నటించాబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి జీవితంలో
అత్యంత కీలకమైన ఘట్టాలతో పూర్తీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

ఎన్నికల సమయానికి ఈ చిత్రం సిద్దం అయ్యే అవకాశాలున్నాయి. చంద్రబాబు, జగన్ వంటి పాత్రలు ఎవరు చేయబోతున్నరన్నది ఇంకా వెల్లడి కాలేదు.