Home News Stories

అమ్మో ఐస్‌క్రీం ఖరీదు 42 లక్షలా ఏంటీ దాని స్పెషల్….

SHARE

ఒక ఐస్ క్రీం 42 లక్షలా ఏంటి దాని స్పెషల్. ఐస్ క్రీం అన్ని డబ్బులు పోసి ఎవరన్న కొంటరా…. ఇవే కదా లక్షల్లో ఐస్ క్రీం ఖరీదు అనగానే సగటు వ్యకికి వచ్చే డౌట్స్. అవును స్పెషలే మరి ఐస్ క్రీంతో పాటు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేస్తే, విలాసవంతమైన రిసార్ట్ లో బస ఏర్పాటు చేస్తే అప్పుడు పెట్టోచ్చాంటరా ఆమాత్రం కాస్ట్…

ఈ ఐస్‌క్రీం కావాలనుకున్న వాళ్లు టాంజానియా వెళ్లాలి. అక్కడికి వెళ్లేందుకు ఐస్‌క్రీం సంస్థే ఫస్ట్‌క్లాస్‌ విమాన టికెట్‌ ఇస్తుంది. విలాసవంతమైన రిసార్ట్స్‌లో బస ఏర్పాటు చేస్తుంది. కాలిఫోర్నియాకు చెందిన ‘త్రీ ట్విన్స్‌’ ఐస్‌క్రీం సంస్థ. అమెరికా నుంచి అక్కడికి చేరుకున్నాక కిలిమంజారో పర్వత శ్రేణి అందాలను ఆస్వాదించేలా అక్కడి ఒక గైడ్ ని సెట్ చేస్తుంది. అంతేనా అనకండి అక్కడే మరో స్పెషల్ ఉంది. పర్వత శ్రేణి పై అరవిరిసిన మందారం లాంటి మంచును తీసుకుని కిందికి వచ్చాక దాంతో ఐస్‌క్రీం తయారు చేస్తారు. ఒక కుండలో దాన్ని తయారు చేయడం ఇక్కడి స్పెషల్.

ఒక్కో ఐస్‌క్రీం అమ్మడం ద్వారా వచ్చే డబ్బుల్లో రూ.7 లక్షలను ఆఫ్రికాలో పర్యావరణం కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఇస్తారు. ఈ ఐస్‌క్రీం ఇద్దరికీ కావాలంటే ఇక్కడ మరో బంపర్ ఆఫర్ ఉంది. కపుల్ కి రూ. 24 లక్షల డిస్కౌంట్‌ను ఇస్తారు. అంటే ఒక్కొక్కరికీ రూ.30 లక్షలే పడుతుంది. అన్నట్లూ ఈ టూర్లో ఐస్‌క్రీం సంస్థ యజమాని గోటిబ్‌ కూడా పాల్గొంటారు.