Home News Stories

అమ్మో అంబానీ శుభలేఖలో ఎన్నెన్ని వింతలో…!

SHARE

అంబానీ తలచుకుంటే ఆడంబరానికి కొదవా… అవును మరి అంబానీ తనయ ఈషా పెళ్లి వేడుకకు అంగరంగ వైభవంగా ప్లాన్ చేస్తున్నారు రిలయన్స్ బాస్. అందులో వియ్యం అందుకునే వారు అషామాషి వారు కాదు మరి…వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ టైకూన్ పిరమల్ గ్రూప్…ఇక ఇంతటి ప్రెస్టేజియస్ పెళ్ళి వేడుకకు ఆహ్వానపత్రిక ఏ రేంజ్ లో ఉండాలి మరి….
రెండు, మూడు వేల కోట్లు ఉన్న ఆసాములే తమ పిల్లల పెళ్లికి వేల రూపాయల పెళ్లిపత్రికలు ఇస్తుంటే.. అంబానీ, పిరమల్‌ల ఆహ్వానం ఇంకెంత ఘనంగా ఉండాలి? అలాగే ఉంది మరి….

అంబానీలకు పిరమల్‌ గ్రూపు తోడైతే ఆ వైభోగమే వేరు కదూ! అవును.. మీరనుకుంటున్నది నిజమే! రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తనయ ఈషా అంబానీ.. పిరమల్‌ గ్రూపు వారసుడు ఆనంద్‌ పిరమల్‌ పెళ్లి ముచ్చటే ఇది. ఇక పెళ్లి పత్రిక విషయానికి వస్తే ఎంత ఘనంగా ఉండాలో అంత ఘనంగానూ ఉంది. దాన్ని పెళ్లి పత్రిక, ఆహ్వాన పత్రిక అనకూడదు.. ‘అంతకు మించి’ అన్నమాట! చూడచక్కటి గులాబీ, పసిడి వన్నె పేటిక.. దాని మూత తెరవగానే లోపల ముద్దులొలికే, కళ్లుచెదిరే నాలుగు బంగరు బుల్లి భోషాణాలు. ఒకదాన్ని తెరిస్తే లోపల పంచముఖ గాయత్రీ మాత చిత్రపటం కనిపిస్తున్న వీడియో ఒకటి విడుదలైంది. మిగతా మూడు బుల్లి భోషాణాల్లోనూ ఆహ్వానితులకు పసిడి కానుకలు ఉంటాయని తెలుస్తుంది.

తొలి ఆహ్వాన పత్రికను ముంబైలోని సిద్ధివినాయక స్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి అందజేశారు. సిద్ధివినాయకుడి ఆలయంలోనే కాదు.. కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ ఆలయాలకు కూడా ముకేశ్‌ అంబానీ స్వయంగా వెళ్లి ఈ ఆహ్వానపత్రికలను స్వామివార్లకు అందజేశారు.
రెండు ఆలయాలకూ రూ.51 లక్షల చెక్కులు ఇచ్చారు.

డిసెంబరు 12న ముంబైలో అంబానీ ఇంట ఈషా-ఆనంద్‌ కల్యాణం జరగనుండగా.. ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు మాత్రం డిసెంబరు 8, 9 తేదీల్లో రాజస్థాన్‌లో జరుగుతాయట. సంగీత్‌ వేడుకల్లో ఆడిపాడేందుకు.. ఈషా అంబానీకి ఇష్టమైన అమెరికన్‌ సింగర్‌ బియాన్స్‌ను ఈ వేడుకకి రప్పిస్తున్నారట. ఆమెకు రూ.15 కోట్ల దాకా పారితోషికం ఇవ్వనున్నట్టు అంబానీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.