Home News Stories

అమెజాన్,ఫ్లిప్ కర్ట్ ఆఫర్ల కథేంటి….ఈ కామర్స్ సంస్థలు ఉచ్చులో పడుతుంది ఎవరు…

SHARE

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌, స్నాప్‌డీల్‌ మెగా దీవాళి సేల్‌, షాప్‌క్లూజ్‌ మహా బచత్‌ సేల్‌,పేటీఎం : మహా క్యాష్‌ బ్యాక్‌ సేల్‌ ఏంటీ ఇవన్ని అనుకుంటున్నారా ఇంకేముంది ఈ కామర్స్ సంస్థలు చేస్తున్న హడావిడి ఇది. అబ్బా ఒక్కటేంటి అన్ని సైట్లు ఆఫర్లతో కస్టమర్ల క్రెడిట్ కార్డులకు యాతం పెట్టేస్తున్నాయి. అసలు ఈ అఫర్లు,అమ్మకాల విలువ దాదాపు 300 కోట్ల డాలర్లు అని అంచనా…. దీన్ని బట్టి అర్దమవుతుంది ఆఫర్ల ఉచ్చులో అందరిని ఇవి ఎలా కట్టిపడేసున్నాయో….

పెద్ద పండగలైన దసరా, దీపావళి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ సంస్థలు భారీ ఎత్తున అమ్మకాలకు తెరతీశాయి. కొనుగోలుదారులకు ఊహించని స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ఇస్తున్నాయి. అమ్మకాలు పెంచుకునేందుకు ఈ సంస్థలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నాయి. ప్రచారం, ఆఫర్ల కోసం రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ సంస్థలు అంతకు అనేక రెట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నాయి. ఈసారి పండగల సీజన్‌ అమ్మకాల్లో దాదాపు 2 కోట్ల మంది వివిధ ఇ-కామర్స్‌ సైట్ల ద్వారా షాపింగ్‌ చేసే అవకాశం ఉండవచ్చని అంచనా…

ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తులు, గ్యాడ్జెట్లు, దుస్తులు, పర్సనల్‌, హెల్త్‌కేర్‌, ష్యాషన్‌ యాక్సెసరీస్‌, ఫుట్‌వేర్‌, ఫర్నీచర్‌, స్మార్ట్‌ వేరబుల్స్‌ తదితర ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఏడాది కాలంలో పండగల సీజన్‌ అయిన ఈ రెండు మూడు నెలల్లోనే అత్యధికంగా వ్యాపారం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ-కామర్స్‌ సంస్థ లు తమ కస్టమర్లను పెంచుకునేందుకు చిన్న పట్టణాలకు కూడా డెలివరీ సదుపాయాన్ని మెరుగుపరుస్తున్నాయి. పట్టణాల్లోని కస్టమర్లకు ఈ-కామర్స్‌పై అవగాహన ఇప్పటికే ఉంది. చిన్న పట్టణాల్లోని వారు మాత్రం ఇప్పుడిప్పుడు ఈ-కామర్స్‌ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కస్టమర్లు ఏ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో అలాంటి వాటి పైనే ఈ-కామర్స్‌ టార్గెట్ చేసి ఆఫర్లు ప్రకటిస్తుంది.

అసలి బంపర్ ఆఫర్లతో ఎవరికి ప్రయోజనం. ఇ-కామర్స్‌ సంస్థలు పండగల సీజన్‌లో నిర్వహిస్తున్న అమ్మకాల ద్వారా వ్యాపార సంస్థల అమ్మకాల వృద్ధితోపాటు స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అవకాశం ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. చిన్న వ్యాపారస్తులు కూడా తమ వద్ద ఉన్న ఉత్పత్తులు దేశంలోని ఏ కస్టమర్‌ కైనా విక్రయించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వారి వ్యాపారం మరింతగా పెరుగుతుంది. పండగల సీజన్‌లోని డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్‌ 50,000 మందిని ,ఫ్లిప్‌కార్ట్‌ 30,000 మందిని సప్లయ్‌ చెయిన్‌, లాజిస్టిక్స్‌ కార్యకలాపాల్లో పని చేసేందుకు రిక్రూట్ చేసుకున్నాయి. ఇతర ఇ-కామర్స్‌ సంస్థలు కూడా భారీ స్థాయిలోనే సిబ్బందిని నియమించుకుంటున్నాయి. వీరు తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తారు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో చెల్లింపులు చేస్తే తక్షణ డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌లు కూడా లభిస్తుంటాయి.

ఆఫ్‌లైన్‌ స్టోర్లతో పోల్చితే ఆన్‌లైన్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న అమ్మకాల్లో వీటి ధరలు మరింత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే తాము కొనుగోలు చేసే ఉత్పత్తి ఆఫర్‌ను చూసి కాకుండా అది తమకు ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు.

ఈసారి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సందర్భంగా అమ్మకాలను భారీ స్థాయిలో పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ పలు రంగాలకు చెందిన దాదాపు డజను మంది సెలబ్రిటీలను ప్రచారం కోసం రంగంలోకి దింపింది. వీరిలో క్రి కెటర్లు, బాలీవుడ్‌ హీరో, హీరోయిన్లు కూడా ఉన్నారు. క్రికెటర్లు ఎంఎస్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, గంగూలీతోపాటు బ్రాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌ కపూర్‌, అలియాభట్‌, శ్రద్ధాకపూర్‌, దీపికా పదుకునే, సమంత, తమన్నా ఉన్నారు. సోషల్‌ మీడియాతోపాటు టీవీలు, పత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది.

పేటీఎం ఇ-కామర్స్‌కు చెందిన పేటీఎం మాల్‌ ‘మహా క్యాష్‌బ్యాక్‌ సేల్‌’లో భాగంగా రూ.501 కోట్ల విలువైన క్యాష్‌బ్యాక్‌, పేటీఎం గోల్డ్‌ను కొనుగోలుదారులకు అందిస్తున్నట్టు ప్రకటించింది. 10 కోట్లకు పైగా ఉత్పత్తులు తమ మాల్‌లో అందుబాటులో ఉన్నాయని, 20 వేలకు పైగా పిన్‌కోడ్స్‌కు డెలివరీ చేసే సదుపాయం ఉందని చెబుతోంది. వివిధ ఉత్పత్తుల కొనుగోళ్లపై నోకాస్ట్‌ ఈంఐ సదుపాయంతోపాటు అదనంగా బ్యాంకులు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తుందన్నట్టు తెలిపింది. కస్టమర్లు ఏడు రెనో క్విడ్‌ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా తెలిపింది.