Home Entertainment Cinema

అల్లువారి రామాయణంలో రాముడు తారకే ఏ నా…?

SHARE

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గతంలో ఒకసారి రామాయణం ప్రాజెక్టను భారీ స్థాయిలో టేకప్ చేస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ రెండేళ్ళ పాటు ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అది మరుగునపడిందని అనుకున్నారు. మరోసారి రామాయణం ప్రాజెక్టు గురించి వెల్లడించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ ప్రాజెక్టువైపు మళ్ళింది. 1500 కోట్ల రూపాయల బడ్జెట్.. మూడు భాగాలు.. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ సెట్ అయ్యారని అంటున్నారు.

అయితే ఈచిత్రంలో మొదట రామ్ చరణ్ రాముడిగా నటించే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ చరణ్ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా లేడని.. అల్లు అరవింద్ వేరే హీరో కోసం చూస్తున్నారని కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోగా ఎవరు ఉండొచ్చు.. ఎవరు సూటవుతారు అనేదానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంలో ఎక్కువమంది నెటిజన్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే తమ మద్దతు తెలుపుతున్నారు.

ఈ జెనరేషన్ స్టార్ హీరోలలో పౌరాణిక చిత్రాలకు సూట్ అయ్యే క్వాలిటీస్ ఎన్టీఆర్ లోనే ఎక్కువ ఉన్నాయని.. ఇంటెన్స్ యాక్టింగ్.. డైలాగ్ డిక్షన్.. ఫేస్ ఫీచర్స్ ఇలా ఏం అంశాన్ని తీసుకున్నా ఎన్టీఆర్ కు వంక పెట్టలేమని అంటున్నారు. అంతే కాకుండా ఈ తరం స్టార్ హీరోలలో పౌరాణికపాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో ఎన్టీఆర్ ఒక్కరే. తాతగారు సీనియర్ ఎన్టీఆర్ బాటలో పౌరాణిక పాత్రల్లో నటించి ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నారు. మాస్టర్ ఎన్టీఆర్ గా మొదటి సినిమా ‘బాలల రామాయణం’ లో నటించి అందరినీ ఆకర్షించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ లో కుర్ర యముడిగా నటించి అదరగొట్టారు.

ఇక ‘జైలవకుశ’ సినిమాలో రావణ పాత్రలో మెరిసి అందరినీ మెప్పించారు. ఇలా రాముడు.. రావణుడు.. యముడు.. ఎలాంటి పాత్రనైనా ఎన్టీఆర్ చక్కగా పోషించగలరు అనే అభిప్రాయన్ని నెటిజనులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ‘రామాయణం’ లో ఎన్టీఆర్ నటిస్తే రాముడి పాత్ర మాత్రమే కాకుండా రావణుడి పాత్రలో కూడా నటించి మెప్పించగలరని అంటున్నారు.

అయితే ఈ నెటిజన్ల అభిప్రాయాల సంగతేమో కానీ అల్లు అరవింద్ క్యాంప్ ప్రస్తుతం ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోను సెట్ చేసే పనిలో పడిందనే టాక్ వినిపిస్తోంది. అలాంటప్పుడు మరి వారు ఎన్టీఆర్ ను ఎంచుకుంటారా అనేది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ ఎన్టీఆర్ వద్దకు ఈ ఆఫర్ వస్తే యాక్సెప్ట్ చేస్తాడా అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే.