Home News Politics

ఆళ్లగడ్డ భూమా అడ్డానేనా…?

SHARE

కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. భూమా కుటుంబానికి పెట్టనికోటగా ఉండే ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. గత ఎన్నికలకు ముందు తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో వైసీపీ నుంచి ఏకగ్రీవంగా విజయం సాధించి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు భూమా అఖిలప్రియ. కొద్ది రోజులకే తండ్రి మరణంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూనే ఆళ్లగడ్డ పై పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నారు అఖిలప్రియ. ఇక వైసీపీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడి నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి బరిలో దిగారు. చాలా రోజులుగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో యువ నాయకురాలు,యువ నేత మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది…

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఐదు దశాబ్దాలుగా మూడు కుటుంబాల చేతుల్లోనే ఉంటోంది. 1967 నుంచి గంగుల, ఎస్వీ, భూమా కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ ఉంటోంది. ఆళ్లగడ్డలో ఎవరు గెలిచినా ఈ మూడు కుటుంబాల వారే కావడం గమనార్హం. 1967 నుంచి గంగుల కుటుంబం ఐదుసార్లు విజయం సాధించింది. ఎస్వీ కుటుంబం నుంచి శోభానాగిరెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి రెండుసార్లు చొప్పున గెలుపొందారు. భూమా కుటుంబం నుంచి భూమా నాగిరెడ్డి అన్న శేఖర్ రెడ్డి ఒకసారి, భూమా నాగిరెడ్డి రెండు సార్లు, ఆయన భార్య భూమా శోభానాగిరెడ్డి ఐదుసార్లు విజయం సాధించారు. శోభానాగిరెడ్డి మరణం తర్వాత ఆమె కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు. ఇక్కడ మరోసారి భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటీ ఉండనుంది.

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న అఖిలప్రియ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. గడచిన రెండేళ్లలో 2 వేల కోట్ల నిధులు నియెజకవర్గ అభివృద్ధికి మంజుజూరు చేయించారు. నీరు చెట్టు పథకం కింద 250 కోట్లు ఆళ్ళగడ్డ పట్టణంలో పారిశుధ్యం,మొలకలవాగు అభివృద్ధి, పట్టణంలోని పేదల గృహ నిర్మణాలకు500కోట్ల
నిధులు తీసుకోచ్చి నియోజకవర్గాన్ని అభివృద్దిపధంలో నడిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పర్యటక కేంద్రంగా అబివృద్ది చేశారు.ఇక తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, తల్లిదండ్రులను కోల్పోయినందున అఖిలప్రియ పై ప్రజల్లో సానుభూతి ఉండటం ఆమెకు కలిసివచ్చే అంశం. అయితే తన తండ్రికి అనుచరులుగా ఉన్న వారు కూడా అఖిలప్రియకు దూరమవుతున్నారు. ఇక్కడ టీడీపీ తరపున పలుమార్లు పోటీ చేసి ఓడిన ఇరిగెల రాంపుల్లారెడ్డి కుటుంబం ఇటీవలే ఆ పార్టీని వీడి వైసీపీలో చేరింది.

వైసీపీ ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తుంది. నియోజకవర్గంలో కాపులు,ముస్లీం ఓటర్లు అధికం. కేసీ కెనాల్,తెలుగు గంగ నుంచి వచ్చే నీటి పైనే ఇక్కడ రైతులు ఆధారపడ్డారు. భూమా కుటుంబానికి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. బీజేపీతో పొత్తు లేకపోవడం కూడా ఇక్కడ టీడీపీకి ప్లస్ గా మారనుంది. కాపు ఓట్లు జనసేన కొంత చీల్చే అవకాశం ఉంది. ఇక మంత్రి అఖిలప్రియ ప్రభుత్వ పథకాలను జనంలోకి బలంగా తీసుకువెళ్ళడం ఆమెకు ప్లస్ గా మారనుంది. తనను తల్లి శోభానాగిరెడ్డిలా ఆదరించాలంటు జనంలో మమేకమవుతు ప్రచారంలో ముందున్నారు అఖిల. ఇక జనసేన అభ్యర్ధి పై ఇక్కడ క్లారిటీ లేదు. వైసీపీ అభ్యర్ధి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి జగన్ చరిష్మ,నవరత్నాల పేరుతో జనంలోకి వెళ్తున్నారు.ఏదిఏమైన ఇక్కడ భూమా ఫ్యామిలీకే అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.