Home Entertainment Cinema

అబ్బో బిగ్ బాస్ తో కౌశల్ స్టార్ అయ్యాడే…!

SHARE

కౌశల్ ఇప్పుడు బుల్లితెర పై సూపర్ స్టార్. అవును మరి బిగ్ బాస్ దెబ్బకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాదు కాదు (అమ్మో కౌశల్ ఆర్మీ)ఆల్ ఇండియా కే స్టార్ అయి కుర్చున్నాడు.ఇప్పుడి కౌశల్ స్టార్ రేంజ్ చూసి బడా బడా షాపింగ్ మాల్సే బాబ్బాబు ఒక్కసారి మీ పాదం మా మాల్ లో పెట్టి పావనం చేయండి అంటూ హడావిడి చేస్తున్నాయి. ఒకసారి ఇదర్ దేఖొ…

బిగ్ బాస్ తో మంచి గుర్తిపు తెచ్చుకున్న కౌశల్ ఏ స్థాయిలో బిగ్ బాస్ తో లైం లైట్ లోకి వచ్చాడో సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. కౌశల్ ఆర్మీ పేరుతో ఆయనకు మద్దతుగా చేసిన హడావిడి అంత ఇంతా కాదు. అది ఆయన విజయంలో కూడ కీలక పాత్ర పోషించింది. అయితే కొందరు మాత్రం కౌశల్ అభిమానులను ఫేక్ అని – స్టార్ డం ఆయనకు ఆయన సృష్టించుకున్నదే అంటూ విమర్శలు చేస్తున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కు అనూహ్యంగా స్టార్ ఇమేజ్ దక్కిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ కు ముందు వరకు కొంత మందికి మాత్రమే తెలిసిన కౌశల్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు తెలిసి పోయింది. తాజాగా ఆ విమర్శలకు ఆయన అభిమానులు సమాధానం ఇచ్చారు. సడన్ గా కౌశల్ కి కేఎల్ ఎమ్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్ వచ్చింది. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు స్టార్ హీరోయిన్స్ లేదంటే హీరోలు మాత్రమే వెళ్తారు. కాని అనూహ్యంగా కౌశల్ ను షాపింగ్ మాల్ వారు ఆహ్వానించారు.

నిన్న మొన్న స్టార్ అయిన క్యాండెట్ ఏ కదా అని కౌశల్ ని లైట్ తీసుకున్న నిర్వాహకులు సాదాసీదాగా ఏర్పాట్లు చేశారు. కాని కౌశల్ వస్తున్న విషయం తెలిసిన జనాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో నిర్వాహకులు నోరెళ్లబెట్టారు.ఎంతైనా బిగ్ బాస్ తో కౌశల్ కూడా స్టార్ అయిపోయాడు మరి…