Home News Politics

ఆ రోజుల్లోనే జ‌గ‌న్ పేరిట‌ అరుదైన రికార్డు…

SHARE

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తల పెట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతుండగా నిన్న ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. జగన్‌ కి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్‌ మిత్రులు హైదరాబాద్‌ నుంచి వైజాగ్ వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైఎస్‌ జగన్‌ శనివారం కొత్తపాలెం దగ్గర వైజాగ్ సిటీలో ఎంటరయ్యారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 30మంది పూర్వ విద్యార్థులు వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చారు. జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా పాదయాత్ర‌లో పాదం కలిపారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జగన్ క్లాస్ లీడర్ గా ఉండి రికార్డు సృష్టించారన్న వారు . అప్పట్లో జగన్ రెడ్ హౌజ్ కెప్టెన్ గా వ్యవహరించారని, ఆల్ రౌండర్ షీల్డ్ లు కూడా అందుకున్నారని గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ అందరికీ అండగా ఉండేవారని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యమేసిందని, అటువంటి వ్యక్తి తమకు స్నేహితుడు కావడం గర్వంగా ఉందన్నారు. జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు జగన్ ఫ్రెండ్స్.