Home Entertainment Cinema

ఆ వయసులో నా పై కూడా లైంగిక దాడి..!

SHARE

త‌ను శ్రీ ద‌త్తా ఉదంతంతో మళ్ళీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచింగ్ అపి చర్చ మొదలైంది. మీటూ మూవ్ మెంట్ లో త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప‌బ్లిక్ గా చెప్పాల‌ని కోరుతున్న తారాలు తమకు జరిగిన చేదు అనుభవాల పై గొంతెత్తుతున్నారు. ఏమాయ చేశావే’ సినిమాలో హస్కీ వాయిస్‌తో సమంతకు డబ్బింగ్ చెప్పిన గాయని చిన్మయి శ్రీపాద.. తనపై జరిగిన లైగింక దాడిని గుర్తు తెచ్చుకుని చిన్నబోయింది.

మ‌న గురించి స‌మాజం ఎలా అనుకున్న ప‌ర్వాలేదు…భావి త‌రాల‌కు మ‌నం ఓ పాఠం కావాల‌ని అంటున్నారు సినీతారలు . ఈ నేప‌థ్యంలో తాజాగా గాయ‌ని చిన్మ‌యి త‌ను చిన్న‌ప్పుడు ఎదుర్కోన్న ఓ చేదు అనుభ‌వాన్ని ట్విట‌ర్ ద్వారా చెప్పుకొచ్చింది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే కొందరు తనను లైంగిక వేదించారని వాపోయింది. సోషల్ మీడియాలో ట్రెండవుతున్న మీటూ‌లో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.


9 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తనకు జరిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో పంచుకుంది చిన్మయి. నేను నిద్రపోతున్నాను. నేను గాఢ నిద్ర‌లో ఉన్న ఆ సమయంలో మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్‌ సెషన్‌‌లో బిజీగా ఉంది. ఆ సమయంలో ఓ వ్యక్తి నా రహస్య భాగాలపై అసభ్యంగా తాకినట్టు నాకు అనిపించింది. నిద్ర మ‌త్తులో ఉన్న నేను విష‌యాన్ని గ‌మ‌నించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. వెంటనే లేచి, అమ్మా ఈ అంకుల్‌ చాలా చెడ్డవాడు అని చెప్పా అంది చిన్మయి. ఈ చేదు సంఘటన శాంతోమ్‌ కమ్యూనికేషన్స్‌ స్టూడియోలో జరిగిందని ఆ స్టూడియో ఇప్ప‌టికీ ఉందని తెలిపింది.

అంతే కాకుండా మరోసారి కూడా తనపై ఇలాంటి లైంగికదాడే జరిగిందన్న చిన్మయి ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని తెలిపింది. కొంతమంది తన షర్ట్ జేబుల్లో ఏముందో చూస్తనంటూ చేతులు పెట్టేవారని తెలిపింది. అంతే కాకుండా ఇటీవ‌ల మిర్యాలగూడలో జ‌రిగిన ప‌రువు హ‌త్య విష‌యంలోనూ చిన్మ‌యి ఘాటుగా స్పందించింది. పేరు చివ‌ర‌న తోక‌లుండ‌కూడ‌ద‌ని…వాటిని క‌ట్ చేయాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్రముఖ నేపథ్య గాయనిగా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి.. సమంతకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ‘యూ టర్న్’ హీరో రాహుల్ రవింద్రన్‌ను 2014లో లవ్ మ్యారేజ్ చేసుకుంది.