Home News Stories

50 లక్షలతో హిట్ కొడతానంటున్న దర్శకేంద్రుడు….

SHARE

ఈమధ్య కాలంలో తెలుగు సినిమా బడ్జెట్ అమాంతం పెరిగి పోయింది. ఓ టైప్ గా సినిమా హిట్ కొడితేనే స్టార్ హీరోల సినిమాలు వందకోట్లకు చేరుతున్న ఈ రోజుల్లో సినిమా నిర్మాణం ఖర్చు కూడా చుక్కలనంటింది. ఈ మధ్య కాలంలో వచ్చిన బాహుబలి మూవీ వందల కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కింది. ప్రస్థుతం షూటింగ్ జరుపుకుంటున్న సైరా మూవీ కూడా అద రేంజ్ బడ్జెట్ లో ఉండబోతుంది. ఇక ప్రభాస్ సాహో సంగతి సరేసరి. కాని ఈ మధ్య చిన్న సినిమాలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. స్టోరీలో దమ్ముండి మంచి హైప్ తో రిలీజ్ అవుతున్న ఈ చిన్న సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలను మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి…వీటి ఇన్ స్ప్రేషన్ ఏమో కాని భారీ బడ్జెట్,భారీ తారగణంతో సినిమాలు తెరకెక్కించే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 50 లక్షల ఖర్చుతో బంపర్ హిట్ సినిమా తీస్తానంటు చాలెంజ్ విసిరాడు…

ఒకేసారి ఇతర భాషల్లో రిలీజ్ చేయడం, భారీగా శాటిలట్,ఆడియో,వీడియో రైట్స్ తో వేల థియోటర్స్ లో సినిమా రిలీజ్ చేసి అందినకాడికి కలెక్షన్ల రూపంలో గుంజుకుంటున్నాయి ఆయా ప్రోడక్షన్లు…ఈ రేంజ్ సినిమా హిట్ ఐతే ఓకే లేకపోతే ప్రొడ్యూసర్ కాస్తో కూస్తో సేఫ్ అయినా బయ్యర్స్ పని ఢమాల్…. అదే సేఫ్ గా చిన్న సినిమాలు అనుకోండి ఈ మధ్య కాలంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ – ‘ఆర్ ఎక్స్ 100’ – ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి చిత్రాలు అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది కోట్ల రూపాయల కలక్షన్లతో దూసుకుపోయాయి. అందుకే మళ్ళీ చిన్న సినిమాల పై మోజు పెరుగుతుంది.

రాఘవేంద్రుడికి మళ్లీ సినిమాలపైకి గాలి మళ్లినట్లుగా అనిపిస్తుంది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. తాను 50 లక్షల బడ్జెట్ తో కంటెంట్ ప్రధానమైన సినిమాను తీయాలని భావిస్తున్నా అన్నాడు. చిన్న బడ్జెట్ చిత్రం – కంటెంట్ ప్రధానమైన చిత్రాన్ని తెరకెక్కించగల సత్తా నాలో ఉందని దాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నాను అంటూ మనసులో మాట బయటపెట్టాడు ఈ వెటరన్ డైరక్టర్. ఇప్పుడు రాఘవేంద్ర రావు ఆ సాహస ప్రయోగం చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.

అప్పట్లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాఘవేంద్ర రావు 50 లక్షల బడ్జెట్ తో కంటెంట్ ప్రధానమైన సినిమాను తీయాలని భావిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్య ప్రయోగాలను స్వాగతిస్తున్నారు. బాగుంటే బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఎవరు దగ్గరకు రాకనే ఈ ట్రెండ్ లోకి దర్శకేంద్రుడు దిగాడా అన్న సెటైర్స్ ని పక్కనబెడితే స్టార్ డైరక్టర్ రాఘవేంద్ర రావు వంటి మెగా దర్శకుడు తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాలు తీయగలిగితే ఈ సినిమాలు ఏ అమెజాన్ వాడో కొనేస్తే వాడే భారీగా డబ్బు చెల్లిస్తాడు. ఇక రిలీజ్ కష్టాలు ఉండవు. థియేటర్ రైట్స్ ,శాటిలైట్ అంటూ భారీగానే సొమ్ము చేసుకోవచ్చు. ఇక సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉంటే దిన్ని ఎవడు ఆపలేడు. ఒక వేళ ఫ్లాప్ అయినా రిస్క్ తక్కువే. ఇంకేం ఐడియా బావుంది రెచ్చిపోండి రాఘవేంద్రరావు గారు…