Home Entertainment Cinema

ఆ సినిమా రిలీజ్ కి ముందే నాలుగు కోట్లు లాస్…

SHARE

రజనీకాంత్-అక్షయ్- శంకర్ కాంబినేషన్ మూవీ `2.0` ఈనెల చివరిలో ధియోటర్లలో సందడి చేయబోతుంగా లైకా ప్రొడక్షన్స్ దాదాపు 600కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తమిళ్ – హిందీ – తెలుగు సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఓ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. అయితే 2.0 కి తెలుగులో మాత్రం రిలీజ్ కి ముందే పెద్ద షాక్ తగిలింది.

2.0 కి రిలీజ్ కు ముందే తెలుగు వెర్షన్ రూపంలో 4 కోట్ల మేర నిర్మాత శుభాస్కరన్ కు పంచ్ పడిందన్నది తాజా సమాచారం. ఇంకా రిలీజ్ కాకముందే 4 కోట్లు నష్టమెలా? అంటే దాని వెనక ఉత్కంఠ రేపే గ్యాంగ్ వార్ ఉందన్నది ఇన్ సైడ్ టాక్. 2.ఓ రిలీజ్ హక్కుల విషయమై రెండు గ్యాంగ్ ల మధ్య వార్ నడవడంపై ఇటీవల పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. దగ్గుబాటి సురేష్ బాబు – ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ గ్యాంగ్ .. ఎన్.వి.ప్రసాద్- దిల్ రాజు-యువి క్రియేషన్స్ వంశీ గ్యాంగ్ మధ్య 2.0 హక్కుల కోసం ఆసక్తికర పోరు సాగింది. ఈ గ్యాంగ్ వార్ లో బోలెడన్ని ట్విస్టులు… టర్నులున్నాయట…

ఈ సినిమా రైట్స్ విషయంలో ఓసారి అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమన్న సురేష్-నారంగ్ బృందం.. ఆ అడ్వాన్సులపై వడ్డీని చెల్లించాల్సిందిగా పట్టుబట్టారట. ఇంకా తమవద్దనే 2.0 హక్కులు ఉన్నాయన్న వాదనా వినిపించడం ఇటీవల చర్చకొచ్చింది. బాహుబలి సిరీస్ తరువాత దక్షిణాది చిత్రాలకు భారీగా డిమాండ్ పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఆశతో `2.ఓ` చిత్ర తెలుగు డబ్బింగ్ హక్కుల్ని 82 కోట్లకు డి.సురేష్ బాబు – సునీల్ నారంగ్ చిత్ర బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందు కోసం కొంత అడ్వాన్స్ గా ఇచ్చారు. రకరకాల కారణాలతో 2.ఓ రిలీజ్ పదే పదే వాయిదా పడింది.


కారణం ఏదైనా అడ్వాన్సుల విషయంలో పెద్ద పేచీ లైకా సంస్థకు సురేష్-నారంగ్ బృందానికి మధ్య నడిచింది. ఆ తరువాత ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ – దిల్ రాజు- యువీ వంశీ టేకోవర్ చేశారు. ఇందుకు షరతులతో కూడిన ఒప్పందాన్ని వీళ్లు కుదుర్చుకున్నారు. ఆ క్రమంలోనే అడ్వాన్సులపై వడ్డీ ఇవ్వాల్సిందేనంటూ డి.సురేష్ బాబు – సునీల్ నారంగ్ లైకా ప్రొడక్షన్స్తో అడ్డంగా వాదనకు దిగారని ప్రచారమైంది. వీరిని కాదని తెలుగులో విడుదల చేయడం కష్టం అని భావించిన నిర్మాత శుభాస్కరన్ తాజాగా దిగొచ్చారట. చివరికి ఈ పంచాయితీ వల్ల అతడు 4 కోట్లు వడ్డీ తిరిగి చెల్లించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్ గా మారింది.

సినిమా విడుదల చేయకుండానే డి.సురేష్ బాబు – సునీల్ నారంగ్ 4 కోట్లు లాభం ఆర్జించడం.. విడ్డూరంగా వుందని సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆ నిర్మాతకు 4 కోట్ల నష్టమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు సినీ జనాలు. దటీజ్ బిజినెస్ గేమ్ అంటూ ట్రేడ్ లో చర్చ సాగుతోంది. సురేష్ బాబు – సునీల్ నారంగ్ రూపంలో 2.0 నిర్మాతకు భారీ పంచ్ పడింది..