Home Entertainment Cinema

2.0 గ్రాఫిక్స్ బడ్జెట్ 180 కోట్లు..శంకర్ కి జస్ట్ లైక్ కదా!

SHARE

భారతీయ సినిమాల్లో భారీతనానికి చిరునామాగా పేరుగాంచిన శంకర్.షణ్ముగం తెలియని వారుండరు.బాగా సంపాదించే సెలెబ్రిటీలలా,బాగా ఖర్చు పెట్టించే సెలబ్రిటీ ఆయన.అలాగని.. జస్ట్ లైక్ దట్ కాదు.స్టోరీకి తగినట్టు,సిట్యుయేషన్ డిమాండ్ చేసినట్టు మాత్రమే ఖర్చు ఉంటుంది.అదేంటో ఆయన సినిమాల్లో సిట్యుయేషన్ డిమాండ్ చెయ్యని సన్నివేశాలు ఏవుంటాయి.ఈ సూపర్ డైరెక్టర్ -సూపర్ స్టార్ రజని కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం 2.0..

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటింగ్ ఇండియన్ ఫిలిం అని వేరేచెప్పకర్లేదు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్ కొంచెం కొంచెంగా మొదలైనట్టే కనిపిస్తున్నాయి.ఇటీవల ఈ సినిమా విశేషాలపై స్పందించిన శంకర్… సుమారు ఏడాదిన్నర క్రితమే విడుదల కావాల్సిన సినిమా,వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి కాకపోవడం వలన సినిమాను ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ఒక ఆంగ్ల ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్‌ పేర్కొన్నారు. నిర్మాతలు ప్రకటించినట్టు సినిమా బడ్జెట్‌ దాదాపు రూ. 543 కోట్లు (75 మిలియన్‌ డాలర్స్‌, పబ్లిసిటీ కార్యక్రమాలతో కలిపి) అని అంగీకరించారు. అందులో మూడోవంతు అంటే రూ. 181 కోట్లు వీఎఫ్‌ఎక్స్‌ పనులకు కేటాయించినట్టు శంకర్‌ తెలిపారు. సినిమాలో 2100 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నట్టు రివీల్ చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు..

ఇంకా శంకర్‌ మాట్లాడుతూ ‘‘టీజర్‌లో పక్షి కనిపిస్తుంది కదా! ముందు ఓ కంపెనీకి ఆ గ్రాఫిక్‌ వర్క్‌ అప్పగించాం. తీరా పని పూర్తయ్యాక చూస్తే… నేను ఊహించినట్టు రాలేదు. మళ్ళీ మొదటి నుంచి వర్క్‌ ప్రారంభించాం’’ అన్నారు. హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ సినిమాలో క్రౌమ్యాన్‌గా, బర్డ్‌మ్యాన్‌గా నటించడం లేదనీ, అంతకు మించి కథ గురించి చెప్పలేననీ శంకర్‌ తెలిపారు. పలు వాయిదాల తర్వాత నవంబర్‌ 29న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అమీ జాక్సన్‌ కథానాయికగా నటించారు. ‘రోబో’లో కథానాయికగా నటించిన ఐశ్వర్యారాయ్‌బచ్చన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

శంకర్ గత సినిమాల ట్రైలర్లలో కథ రివీల్ చేసే అలవాటు లేని శంకర్.. ఈ సినిమా టీజర్ లోనే కథకి హింట్ ఇచ్చారు కానీ,సస్పెన్స్ మాత్రం అదే రేంజ్ లో మెయింటైన్ చేశారు.అది ఆయనకు చెల్లింది కాబట్టే..యూనివర్సల్ డైరెక్టర్ అయ్యారు మరి.