Home Entertainment Cinema

2.ఓ పై ఫైట్ స్టార్ట్ చేసిన సెల్ కంపెనీలు….!

SHARE

2.ఓ సినిమా విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ నటించిన సినిమా 2.ఓ కు టెలికాం ఆపరేటర్లు విలన్లుగా మారారు. మొబైల్ ఫోన్లు, టవర్లు, మొబైల్ సర్వీసులకు పూర్తి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందంటూ టెలికం ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం సైన్స్‌కు విరుద్ధంగా ఉందంటున్నాయి. ఇది ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సెల్ ఫోన్ ని శత్రువుగా చూపిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఇది రాజ్యంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సెల్యూలార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది.

‘‘మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్లు జంతుజాలానికి హానికరం. పశుపక్ష్యాదులు, మానవుల జీవనానికి ప్రమాదకరం. ఎలక్ట్రో‌మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉద్గారాలు వాటి నుంచి వెలువడతాయి’’ అని సినిమాలో పేర్కొన్నారని, ఇది పూర్తిగా అపవాదు మాత్రమే తప్ప మరోటి కాదని పేర్కొంది. సైన్స్‌పై ఉన్న నమ్మకాలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని, సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకోవాలని సీవోఏఐ కోరింది.


అంతేకాదు, సీబీఎఫ్‌సీకి, కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చే వరకు సినిమా ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సీబీఎఫ్‌సీకి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పేర్కొన్నారు. ఈ సినిమా ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళనతో సెల్ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తుంది.