Home News

హోంమంత్రికి‌ సొంత‌ జిల్లా అధికారుల‌ జలక్…!

SHARE

గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్లో అంతర్గత బదిలీల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది … అసలే కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగి పదేళ్ళు దాటింది … దాంతో కార్పొరేషన్లో అధికారులదే పై చేయిగా ఉంటూ… స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇప్పటివరకు పట్టు చిక్కలేదు … ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఉద్యోగులు తమ హవా నిలబెట్టుకోవడానికి పొలిటికల్‌ పైరవీలు మొదలుపెట్టారు … పొలిటీషియన్లు కూడా తమ వంతు పాత్ర పోషించడానికి సిఫార్సులు చేస్తుండటంతో … కార్పొరేషన్లో పొలిటికల్‌ దందా జోరుగా సాగుతోంది .. అంత జరుగుతున్నా జిల్లా మంత్రి మాట మాత్రం చెల్లుబాటు కాలేదంట..


గుంటూరు నగరపాలక సంస్థ … రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరు లో అత్యంత కీలకమైన గుంటూరు నగరపాలక సంస్థ పై పట్టు సాధించేందుకు ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు .. ఇదే అదునుగా తీసుకుని నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు కూడా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని పోస్టింగులు దక్కించుకునేందుకు ఎవరి లాబీయింగ్‌లు వారు చేసుకుంటున్నారు ..


అంతర్గత బదిలీలు శ్రీకారం చుట్టడంతో నగరపాలక సంస్థలో కీలక పోస్టింగులు కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. . గుంటూరు నగర పాలక సంస్థలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టు మొదలుకొని … సిటీ ప్లానర్… బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు… శానిటరీ ఇన్స్‌పెక్టర్లు.. ఇలా దండిగా రెవెన్యూ ఉండే విభాగాల్లో పట్టు కోసం ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌లు నడుపుతున్నారు .. గత ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో ఉద్యోగులు కీలక పోస్టింగులు దక్కించుకున్నారు …


అయితే ఇప్పుడు వైసిపి అధికారంలోకి రావడంతో … ఉద్యోగుల్లో మరో వర్గం నగరపాలక సంస్థలో పోస్టింగ్ కోసం చక్రం తిప్పుతున్నారు .. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స మొదలుకొని …హోంమంత్రి సుచరిత వరకు ఎవరి స్థాయిలో వారు పలుకుబడి ఉపయోగించి తమకు అనుకూలురైన వారి పోస్టింగుల కోసం ప్రయత్నిస్తున్నారు .. ఇక్కడే టౌన్ ప్లానింగ్ అధికారి గా పనిచేసిన ఒక అధికారి తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.. ఈ విషయాన్ని ఆయనకు అండగా ఉన్న ఉన్నతాధికారులు హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్లారట …


ఈ విషయమై హోంమంత్రి మున్సిపల్ కమిషనర్‌ని సంప్రదించగా .. సదరు టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై విముఖత వ్యక్తం చేసారంట.. దీంతో హోంమంత్రి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు తయారైందంట .. అయితే మున్సిపల్ కమిషనర్‌తో హోం మంత్రితో పాటు ఆమె కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా టచ్‌లోకి వెళ్లడం వల్లనే ఐఏఎస్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్ నెగిటివ్‌ రియాక్ట్‌ అయ్యారని ప్రచారం జరుగుతోంది …

ఈ వ్యవహారం ఆ నోట ఈ నోట ముఖ్యమంత్రి వరకు వెళ్లిందంట .. బదిలీల వ్యవహారంలో హోంమంత్రి ఫ్యామిలీ మెంబర్స్‌ వత్తిళ్లు తీసుకురావడంపై ముఖ్యమంత్రి కూడా స్పందించినట్లు తెలుస్తోంది .. అదలాఉంటే అధికారులు కూడా మంత్రులు, ఎమ్మెల్యేల వత్తిళ్లు, బదిలీల విషయంలో వారి మధ్య పోటీని దృష్టిలో పెట్టుకుని… చాకచక్యంగా వ్యవహరిస్తూ బదిలీల తతంగం కానిస్తున్నారంట.. ఏదేమైనా సొంత జిల్లాలో చిన్న బదిలీ విషయంలోనే పని చేయించుకోలేక పోయానన్న అసంతృప్తితో హోంమినిస్టర్‌ రగిలిపోతున్నారంట ..