Home News

సినిమాల్లో రేంజ్ పెంచిన రాములమ్మ…!

SHARE

మొన్నటిదాకా పొలిటికల్ ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ 26వ సినిమాలో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు.

ఇపుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి కళ్ళు చెదిరే పర్‌ఫార్మెన్స్ కనబర్చనుంది. ఇక పారితోషికం విషయంలోను రాజీపడని ఈ లేడీ బాస్ కి 3 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశార ప్రోడ్యూసర్.

ఇక లేటెస్ట్ గా విజయశాంతి.. తన పెళ్లి, పిల్లలు, కెరీర్ సంబంధిత ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇక సినీ జీవితంలో విజయశాంతి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణం చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది. ఉదయం లేచింది మొదలు నిర్విరామంగా, కంటి మీద కునుకు లేకుండా విజయశాంతి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా అప్పటి సంఘటనల పై స్పందించింది లేడి అమితాబ్. తన 17 వ ఏటనే తండ్రి చనిపోయారని, ఆ తరువాత ఏడాది కాలంలోనే తల్లి కూడా చనిపోవడంతో తాను దిక్కులేనిదాన్నయిపోయా అంది విజయశాంతి. తనను ఓ గొప్ప నటిగా చూడాలని తన తల్లిదండ్రులు ఆశపడ్డారని కనీసం తిన్నావా?పడుకున్నావా? అని అడిగే వారే లేని దుర్భర పరిస్థితిని తాను ఎదుర్కొన్నాని విజయశాంతి తెలిపింది.

కష్టాలతో ఉన్న ఆ సమయంలో నిర్మాత శ్రీనివాసప్రసాద్‌గారు పరిచయం కావడం జరిగిందని, ఆయనే తనలో ఆత్మస్థైర్యం నింపారని విజయశాంతి పేర్కొంది. ఆ తర్వాత శ్రీనివాసప్రసాద్‌ నిర్మాణంలో వచ్చిన ‘కర్తవ్యం’ సినిమా ద్వారానే తనకు లేడీ అమితాబ్ గా గుర్తింపు వచ్చిందని, అలా అలా మీ అందరికీ బాగా దగ్గరయ్యానని చెప్పుకొచ్చింది. పెళ్ళై 32 ఏళ్లయింది.. కానీ అదృష్టవశాత్తు తనకు మంచి భర్త దొరికాడంది విజయశాంతి. 1988 మార్చి 29న మేం రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకున్నామని, పెళ్ళై 32 ఏళ్లయింది. నా కష్టంలో ఎప్పుడూ వెంట నిలుస్తాడు నా భర్త. నా లైఫ్‌లో మా ఆయనే నా అసలు సిసలు హీరో అని చెప్పుకొచ్చింది. అందుకే పిల్లల్నికనలేదు తన భర్తకు, తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయశాంతి.. ఉద్యమం, పార్టీ లాంటి మొదలుపెట్టాక తమకు పిల్లల్ని కనాలని అనిపించలేదని పేర్కొంది.