Home News

రామ్ మాధవ్ తో పవన్ కళ్యాణ్ చర్చలు…అందుకేనా…!

SHARE

అమెరికాలోని తానా మహాసభల్లో బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో బలపడేందుకు ప్యూహరచన చేస్తున్న బీజేపీ మళ్ళీ పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది….

తానాకు హాజరైన బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరుగా ఉండటమే ఒక సంచలనం అయితే ఎప్పుడూ ఇలాంటి వాటికి ఆసక్తి చూపని పవన్ తానాకు వెళ్ళడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. అంతకుమించి విశేషం ఏంటంటే వీరిద్దరి మధ్య చాలాసేపు ఏపీ రాజకీయాల పై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బయటకి మాత్రం రాష్ట్ర విభజన హామీల అమలు,రాష్ట్రానికి ఇంకా ఏం చేయాల్సి ఉందన్న అంశంపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు చెబుతున్నా ఇంకా ఏదో పెద్ద విషయమే ఉందన్న అనుమానం వ్యక్తమవుతుంది.

ఇప్పటికే ఏపీ లో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి  రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించేందుకు  బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బలమైన టీడీపీ లీడర్ల పై ఫోకస్ పెట్టి చేరికలు ప్రోత్సహిస్తున్న కమలదళం చరిష్మాటిక్ లీడర్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మాజీ కేంద్రమంత్రి హీరో చింరంజీవిని పార్టీలోకి ఆహ్వానించింది. దీనికి ఆయన పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మళ్ళీ పాత మిత్రుడు పవన్ పై గురిపెట్టిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీపాలిటిక్స్ లో కులాలు ప్రభావం ఎక్కువ. రాష్ట్రంలో సుమారు 12 శాతం ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉండటంతో ఆ సామాజిక వర్గం నుంచే బలమైన లీడర్ ని ప్రొజెక్ట్ చేయాలని చూస్తుంది బీజేపీ. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చాలమంది బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాపు సామాజికవర్గాన్ని తమ వైపుకు తిప్పుకొంటే  రాజకీయంగా ప్రయోజనమని భావిస్తున్న కమలం పార్టీ ఆ దిశగానే పవన్ తో సంప్రదింపులు జరుపుతుందా అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కల్గిస్తోంది.