Home Entertainment

బిగ్ బాస్ లో చాన్స్ కొట్టేసిన టీవీ 9 జాఫర్…!

SHARE

మీడియాలో కేరాఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న TV9 జాఫర్ బిగ్ బాస్ 3 కి సెలక్టయ్యాడు. తనదైన శైలీలో సెలబ్రిటీలను ఇంటర్యూ చేస్తూ తిక మక ప్రశ్నలతో కన్ ప్యూజ్ చేసే జాఫర్ కు బిగ్ హౌజ్ లోకి ఎంట్రీ ఖాయమైందట. గత సీజన్ లో కూడా TV9 నుంచి రిపోర్టర్ దీప్తి బిగ్ బాస్ 2 కి సెలక్టయ్యారు. TV9 లో ముఖాముఖి పేరుతో సెలబ్రిటీస్ ని ఇంటర్యూ చేస్తూ ఇరిటేట్ చేసి నిజాలు రాబట్టడం జాఫర్ స్టైల్. ఇక జాఫర్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ ఎన్నికాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తుందో చూడాలి.

ఇక జాఫర్ తో పాటు ఫన్ బకెట్ ఫేమ్ మహేశ్ విట్టా కూడా సెలక్ట్ అయ్యారని తెలుస్తుంది. కమెడియన్ గా చిత్తూరు,కడప యాసలో కడుపుబ్బ నవ్విస్తాడు మహేశ్. కృష్ణార్జున యుద్దం తర్వాత సినిమా చాన్స్ లేవి లేవు మహేశ్ కి. వీరితో పాటు హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితిక షేరు కి కూడా చాన్స్ దక్కిందట. అప్పట్లో ఫేక్ వార్తతో బాగా ఫేమస్ అయింది వితిక. ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో ఉన్న వేరే మహిళని వితిక పేరుతో ఆత్మహత్య కి పాల్పడిందంటూ ట్రోల్ చేయడంతో అప్పట్లో భార్య,భర్త లిద్దరు మేంకాదు అంటూ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పటికే వరుణ్ సందేశ్ కూడా ఈ షోకి ఎంపికయ్యారు.