Home News

నెల్లూరులో ఆ సీనియర్లకు అంత సీన్ లేదా…!

SHARE

నెల్లూరు జిల్లాలో సీనియర్లను పక్కనపెట్టి … జూనియర్లకు కీలకమైన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు సీఎం.. మరి ఇప్పుడు ఆ సీనియర్లకు ఏ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు? … వారి సేవలు ఎలా వినియోగించుకుంటారు? ..జిల్లాలో రాజకీయ దిగ్గజాలుగా వున్న అనం, నేదురుమల్లి, కాకాణి కుటుంబాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? .. ప్రస్తుతం జిల్లాలో ఇదే చర్చ నడుస్తోంది…

ఏపిలో వైసిపి అద్భుత విజయం సాధించింది… కొన్ని జిల్లాలకు జిల్లాలు క్లీన్ స్వీప్ చేసింది … అలాంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి … జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 ఎంపి స్థానాలు వైసిపి ఖాతాలోకే వెళ్లాయి… టిడిపి కొలుకోలేని విధంగా చావు దెబ్బతింది … జిల్లాలో ముందు నుంచి వైసిపి ఆధిపత్యమే కొనసాగినా … టిడిపి ఉనికి చాటుకుంటూ వచ్చింది.. అయితే తాజా ఎన్నికల ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు టిడిపికి ఘోర పరాజయాన్ని మగిల్చాయి .. జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలన్ని ఇప్పుడు వైసిపి గూటికి చేరడం.. ఆ పార్టీకి తిరుగులేని విజయానికి ఓ కారణంగా చెప్పవచ్చు.

జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాలు అంటే ఆనం, కాకాణి, మేకపాటి, తిక్కవరపు , మాగంటి, నల్లపరెడ్డి ఫ్యామిలీలే .. ఒక్క తిక్కవరపు కుటుంబం ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు దూరంగా వుంది… ఇక మిగతా అన్ని కుటుంబాలు ఇప్పుడు వైసిపిలోనే ఉన్నాయి… అందులో ఎన్నికల ముందు టిడిపి నుంచి ఆనం కుటుంబం కూడా చేరింది … దీంతో జిల్లా దిగ్గజాలు అందరూ ఇప్పుడు వైసిపిలో కొనసాగుతున్న పరిస్థితి జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రులుగా వున్న మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కూమార్‌యాదవ్‌లు .. సీనియర్లతో పోల్చుకుంటే వయస్సులోనూ, అనుభవంలోనూ చిన్నవారే … అయితే వారికే కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు సిఎం జగన్మోహన్‌రెడ్డి … అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఇరిగేషన్, మేకపాటి గౌతంరెడ్డికి ఐటి పరిశ్రమల శాఖలు ఇచ్చి వారి ప్రాధాన్యాన్ని పెంచారు

అయితే రాష్టస్థాయిలో మంచి సంబంధాలు ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు … మిగతా వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే అంశంపై ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది … క్యాబినెట్లో రెండున్నర ఏళ్ల తర్వాత మార్పులుంటాయని ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నారు.. దాంతో జిల్లాలోని సీనియర్లకు అప్పుడు అవకాశం వస్తుందని ప్రచారం సాగుతున్నప్పటికి.. ముందుగా వీరి అనుభవాన్ని పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించుకుంటారని అంటున్నారు …

ముఖ్యంగా వారిలో ఆనంతో పాటు మాగంటి కుటుంబాలకు రాష్ట వ్యాప్తంగా సంబందాలు వున్నాయి … వాటిని వినియోగించుకుని పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దడానికి సిఏం వారిని ఉపయోగించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది … మొత్తం మీద జిల్లాలో జూనియర్లకు క్యాబినెట్‌ బెర్త్‌లు ఇచ్చి.. ముఖ్యమంత్రి ప్రయోగం చేస్తున్నారన్న టాక్‌ వినిపిస్తున్నా … సీనియర్లకు తగిన సమయంలో తప్పకుండా ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు… త్వరలో సీనియర్లకు పార్టీ తరపున కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది .. ఏదేమైనా సీనియర్లను జగన్మోహన్‌రెడ్డి ఎలా ఉపయోగించుకుంటారనే అంశంపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది …