Home News

చంద్రబాబుకు నేతల అప్పుల బెడద…

SHARE

తెలుగు తమ్ముళ్ళ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అత్యుత్సాహనికి పోయి ఉన్నదంతా ఊడ్చి మరీ ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టారు కొందరు నేతలు. మరికొందరు నేతలు అధినేత మాట తూచా తప్పకుండా పాటించాలని ప్రయత్నంతో లేని కష్టాలు తెచ్చిపెట్టుకున్నారు.

ఆదిపత్యం నిలుపుకొనేందుకు ఎక్కడపడితే అక్కడ డబ్బులు అప్పులు తెచ్చిమరీ ఎన్నికల్లో విరజిమ్మారు. గెలుపు తమదే అన్న ధీమాతో మరికొందరితో పెట్టుబడులు పెట్టించారు. తీరా రిజల్ట్ రివర్సయ్యే సరికి తెచ్చిన సొమ్ములు ఎలా తిరిగి ఇవ్వాలో అర్ధం కాక, పూచి ఉన్నవారికి ఎం సమాధానం చెప్పాలో అర్ధంకాక అమరావతిలోని అధినేత ఇంటి చుట్టు చక్కర్లు కొడుతున్నారు.

అక్కడ ఎలాంటి హమీలు దక్కకపోవడతో నానా తంటాలు పడుతున్నారు సైకిల్ పార్టీ నేతలు.తెలుగు దేశం పార్టీ నేతలు ఓటమి భారం మోయలేక నానా తిప్పలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో అంతా తామే చేసి అన్ని సీట్లు గెలిపించామని చెప్పుకునే నేతలు 2019లోను తమ మార్క్ చూపించుకునే ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు. చాలా నియోజకవర్గాల్లో తమ మార్క్ రాజకీయం చూపించేందుకు ఉన్నదంతా ఊడ్చేసి ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టారు. పోలింగ్ దగ్గరపడే సమయానికి చాలా మంది అభ్యర్ధులకు డబ్బులు అందకపోవడంతో అధినేత హమీ ఉందంటూ మధ్య వర్తులుగా ఉన్న కొందరు నాయకులు నియోజకవర్గాల్లోని పెద్దల దగ్గర పెద్ద మొత్తాల్లో అప్పులు తెచ్చారు. ఎలాగు విజయం మనదే కాబట్టి రిజల్ట్ తర్వాత చూసుకొవచ్చునుకునే నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. అనుకున్న రిజల్ట్ రాకపోగా ఘోరంగా ఓటమి పాలయ్యారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ నేత చింతలపూడి, గోపాలపురం,పోలవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో తన మార్క్ ఎంతుదో చూపించాలని ప్రయత్నించి అప్పుల పాలయిపోయారట. తీరా అసలు తిరిగి కట్టాల్సింది పదికోట్ల పైమాటగానే ఉండటంతో అధినేత వద్దకి వరుసగా తిరుగుతూనే ఉన్నారట. అక్కడ ఎలాంటి హమీ దక్కకపోవడంతో ఉన్న పొలం అమ్మయినా పరువు మిగుల్చుకోవాలని చూస్తున్నారు.

ఎన్నికల్లో గెలుపు సంగతెలా ఉన్నా.. ఓటమి కారణంగా మిగిలిన అప్పులు ఇపుడు పోటీ చేసిన అభ్యర్ధులను అయోమయంలోకి నెడుతున్నాయట. ఆధిపత్యం కోసం అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రయత్నించడం, అధినేత ముందు బీరాలు పోయి చివరకు అటు పార్టీ నేతలు,పట్టించుకోక ఇటు పెట్టుబడులు పెట్టిన వారి ఒత్తిడితో రెంటికి చెడ్డ రేవడిలా నేతల పరిస్థితి తయారయ్యింది. అటు నియోజకవర్గంలో అప్పుల బాధ భరించలేక అమరావతిలో పార్టీ అధినేత ఇంటి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు….