Home News Stories

గులాబీ పార్టీలో రాజీనామాల రగడ…!

SHARE

ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఇతర సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు ఆ పదవులు వదులుకోవడానికి సిద్దమవుతున్నారు.. వరుస రాజీనామాలు చేస్తున్నారు.. ముఖ్యనేతల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరు అదే బాట పడుతున్నారు .. ఎంతో కాలంగా ఆయా సంఘాలకు గౌరవాధ్యక్షులుగా, అధ్యక్షులుగా కొనసాగిన నాయకులు ఇప్పుడు ఎందుకు వాటిని వదులుకోవాల్సి వస్తోంది? .. ఆ తతంగం వెనుక బలమైన కారణమేదైనా ఉందా? తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ రాజీనామల వెనుక ఉన్న ఆంతర్యం ఎంటీ…

టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు తాము ఎప్పటినుంచో నిర్వహిస్తున్న కొన్ని పదవులకు రాజీనామాలు చేస్తున్నారిప్పుడు … ముఖ్యనేతలు సైతం తమకున్న కొన్ని పదవులను వదులుకుంటున్నారు… హరీష్‌రావు .. అదే బాటలో కవిత కూడా వివిధ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు .. ఆ మేరకు ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి సూచనలు అందాయంట..

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివిధ కార్మిక సంఘాలు, ఇతరాత్రా వాటికి గౌరవాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.. కొందరు ఎమ్మెల్యేలు కులసంఘాలకు అధ్యక్షులుగా ఉన్నారు.. అలాంటి వారంతా సదరు కొసరు పదవులను వదులుకోవాల్సిందే అని గులాబీబాస్‌ అల్టిమేటం జారీ చేశారంట … వెలమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ భాను ప్రసాద్ , కమ్మ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వంటి వారికి కూడా ఆ పదవులు వదిలేయాలని సూచించారట…

తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు…. కొన్నేళ్లుగా టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత… సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను విజయపథంలో నడిపించి సక్సెస్ సాధించారు. .. తెలంగాణలోనూ అనేక జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బెల్ట్‌లో టీఆర్ఎస్ బలోపేతానికి ఈ సంఘం ఎంతగానో కృషి చేసింది… అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని భావించిన పార్టీ అధినేత … ఈ పదవులకు రాజీనామాలు చేయాలని సూచించారంట..చట్టసభల్లో ఉన్న పార్టీ నేతలు తమ అదనపు పదవులను వదులుకోవాల్సిందే అని .. కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది… దీంతో కవిత టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు…


రెండు రోజుల క్రితం మాజీమంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు సైతం గుర్తింపు పొందిన ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు… హరీష్‌రావు రాజీనామా చేయడంపై రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి… అయితే తాజాగా కవిత కూడా సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్ష పదవిని వదులుకోవడంతో… హరీశ్ రావు కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే టీఎంయూ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు స్పష్టమవుతోంది… అలాగే గుర్తింపు పొందిన కార్మిక సంఘాల పదవుల్లో ఉన్న వారు కూడా త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది…