Home News Politics

గద్దర్ వాయిస్ ఇక కాంగ్రెస్ నుంచి వినిపించనుందా….గద్దర్ సన్ సూర్య సీటు కథేంటీ…?

SHARE

గద్దర్ కుమారుడికి కాంగ్రెస్‌ టికెట్ ఖరారైందా..? వాళ్లు రాహుల్ గాంధీని కలిసింది కూడా అందుకేనా? స్క్రినింగ్ కమిటీ ముందుకు వెళ్లిన నాయకులకు ఎదురైన అనుభవం ఏంటి..? ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన విద్యార్థి నాయకులు స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ ముందు కు వెళ్ళినప్పుడు… అసలు ఏమైంది..?

ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకులు తాజాగా కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ని కలిసారు … వచ్చే ఎన్నికల్లో ఉస్మానియా విద్యార్థులకు కూడా సీట్లు ఇవ్వండి అని అడిగారట… రాహుల్ గాంధీ కూడా మూడు సీట్ల ఇస్తామని మాటిచ్చారు అని ఆయన దృష్టికి తీసుకెళ్లారట … ఏ సీట్లు ఆశిస్తున్నారని భక్తచరణ్‌ వారిని అడిగారట.. చెన్నూరు, బెల్లంపల్లి సీట్లు ఇవ్వమని విద్యార్థి నేతలు కోరారంట.. దానిపై భక్తచరణ్‌ మాట్లాడుతూ బెల్లంపల్లి గద్దర్ కుమారుడికి ఫైనల్ అయిందని చెప్పుకొచ్చారట..

దాంతో గద్దర్ కుమారుడు సూర్య అసలు బెల్లంపల్లి సీటు కావాలని ధరఖాస్తే పెట్టుకోలేదు..సీటు ఎలా ఫైనల్‌ చేసారని అడిగారట విద్యార్థులు.. అదే విషయమై సదరు కమిటీ చైర్మన్ మిగిలిన నాయకులను అడిగితే .. గద్దర్ తన కుమారుడి కోసం అడిగారని వివరణ విచ్చారంట.. అయితే సూర్య అడుగుతున్న బెల్లంపల్లి సీటుని సీపీఐ కూడా అడుగుతుంది… దానిపై తేల్చకుండా కాంగ్రెస్ అప్పుడే ఆ సీటుపై ఎలా నిర్ణయం తీసుకుందన్న చర్చ జరుగుతోంది..


గద్దర్ కోసం.. ఆయన కుమారుడు సూర్య కి కాంగ్రెస్‌ టికెట్ ఫైనల్ చేస్తుందా..? గద్దర్ కాంగ్రెస్ కి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారా?… ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే…