Home Entertainment Cinema

‘ఓ బేబీ’ 2 డేస్ ఫుల్ జోష్…!

SHARE

ఫస్ట్ష్ షో తోనే హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఓ బేబీ’ ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది. సమంత లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీని సురేష్ ప్రోడక్షన్స్ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత,నాగశౌర్య నటించిన ఈ సినిమా, మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. టెక్నికల్ పరంగా.. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ త్రయం ‘ఓ బేబీ’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లోనే చాలా రిచ్‌గా చూపించారు.

ఓ బేబీ సినిమా మొదటి రోజు కోటి 38 లక్షల రూపాయల షేర్ రాబట్టగా, రెండో రోజు అదే స్పీడ్ కంటిన్యూ చేసింది. ఇక నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే 2 కోట్ల మార్క్ అందుకుంది ఈ సినిమా. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ గడిచేసరికి ఇది 3 కోట్ల మార్క్ టచ్ అవుతుందని ట్రేడ్ టాక్. దర్శకురాలు నందినీరెడ్డి, రచయిత లక్ష్మీ భూపాల్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు అందంగా తెరకెక్కించారు.