Home News

ఆ మంత్రిగారి చుట్టూ టీడీపీ ఎమ్మెల్యేల ప్రదక్షిణలు…!

SHARE

గతంలో‌ టీడీపీలో‌‌ ఆ నేత రెండుసార్లు‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత మారిన పరిణామాల్లో జగన్ గూటికి‌ చేరారు. ప్రతిపక్షంలో ఉండి జగన్ కు‌ తోడుగా పోరాడారు. వరసగా రెండోసారి కూడా వైసీపీ‌‌ నుంచి తరఫున నెగ్గారు. ఆయనకు జగన్ కూడా చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. కీలక‌మైన మంత్రిపదవి వరించింది. కానీ ఇప్పుడు ఆ మంత్రి‌ చుట్టూ వైసీపీ కంటే‌ టీడీపీ నేతలే ఎక్కువ దర్శనమిస్తున్నారు. పాత పరిచయాలో‌,సామాజిక‌వర్గ ప్రభావమో‌‌ కానీ‌‌ ఆ మంత్రికి‌ ఇప్పుడు టీడీపీ‌ నేతల‌ ఫీవర్ పట్టుకుంది.

ఏపీ అసెంబ్లీ సాగుతున్న ప్రస్తుత తరుణంలో మంత్రి కొడాలి నాని చుట్టూ తెలుగుదేశం ఎమ్మెల్యేలే కనిపిస్తూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది. బ్రేక్ సమయాల్లో ఆయన బయటకు వస్తే.. ఆయనను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చుట్టుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీలోని ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే ఆయనను అస్సలు వదలడం లేదట.ఇది ఇప్పుడు అసెంబ్లీ లాబిల్లో‌ హాట్ టాపిక్‌గా మారింది.

ఇక టీడీపీ‌ ఎమ్మెల్యేలు‌ సొంత‌‌ ఎమ్మెల్యేల కంటే ముందుగా ఆయనతో మాట్లాడుతూ.. ఆయనకు కబుర్లు చెబుతూ కనిపిస్తున్నారట. సాధారణంగా అధికార పార్టీ వాళ్లతో – అందునా మంత్రితో ప్రతిపక్షం వాళ్లు మరీ అంత సన్నిహితంగా ఉండరు. అయితే ఆ మంత్రి చుట్టూ మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లు చుట్టుకుంటూ – అసలు మాట్లాడదామన్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదట! అందులో ఆ మంత్రి తప్పేం లేకపోయినా.. తెలుగుదేశం వాళ్లు మాత్రం ఆయనను ఇంకా తమ వాడు అన్నట్టుగా ఓన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది!

దీంతో అసలుకే ఎసరొచ్చేలా‌‌ ఉందని‌ ఆ మంత్రిగారు‌ తెగ‌ ఇదైపోతున్నారు. అందరికంటే ముందు టీడీపీ నేతలపై ఫైరయ్యే నాని‌‌ ఇబ్బందిని‌ చూసి‌ సొంతపార్టీ‌ నేతలే జాలిపడుతున్నారు.