Home News

ఆ నేతకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు…!

SHARE

అక్కడ ఎన్నికల బాధ్యతలన్నీ ఆయనే చూసుకున్నారు… ఆయా నియోజకవర్గాల్లో తమని గెలిపిస్తే … మీరు చెప్పినట్టే వింటామని అభ్యర్థులు ఆయనకు చేతిలో చెయ్యేసి మరీ మాటిచ్చారు … తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారట … ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు కూడా కాలేదు … ఇంతలోనే ఫ్లేట్ ఫిరాయించడమేంటంటూ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసిన ఆ నేత అవాక్కవుతున్నారట …

ప్రకాశం జిల్లాలో దర్శి, సంతనూతలపాడు నియోజకవర్గాల వైసిపి నేతల రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది .. దర్శి నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు… ఆయన స్థానంలో మద్దిశెట్టి వేణుగోపాల్‌ని వైసీపీ బరిలో నిలిపింది… అయితే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కుటుంబానికి దర్శి నియోజక వర్గంలో పట్టుఉండటంతో … అభ్యర్థి ఎంపికకు సంబంధించి వైసీపీ ముఖ్య నేతలు ఆయన సమ్మతి తీసుకున్నారు… దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ ని గెలిపించే బాధ్యత కూడా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై పెట్టారు… నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిచినా… పార్టీ బాధ్యతలు మీకేనంటూ బూచేపల్లికి హామీ కూడా ఇచ్చారు.

ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపొందారు… అక్కడితో బూచేపల్లికి ఇచ్చిన హామాలన్నీ అటకెక్కేసాయంట .. ఎన్నికల రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు తిరగకుండానే బూచేపల్లి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసారంట ఎమ్మెల్యే వేణుగోపాల్ .. పని ఏదైనా చేయాల్సింది తానేనని .. బూచేపల్లి రికమండేషన్స్ వద్దని పార్టీ నాయకులకు నేరుగా చెప్పేస్తున్నారట… దీనికి తోడు ఇటీవల జరిగిన సీఐల బదిలీల్లో కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ తన సామాజిక వర్గానికి చెందిన అధికారికి ప్రాధాన్యత ఇచ్చారట…

సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.. ఎస్సీ రిజర్వుడు స్థానమైన సంతనూతలపాడులో గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు… సంతనూతలపాడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సొంత నియోజక వర్గం కావడంతో ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు… దాంతో నియోజక వర్గంలో ఎన్నికల ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకున్నారు ..

అంత చేసిపెట్టిన బూచేపల్లిని ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యే సుధాకర్‌బాబు పక్కన పెట్టేశారట. పోలీసు అధికారుల బదిలీల్లో బూచేపల్లి చెప్పిన వారికి కాకుండా సుధాకర్ బాబు నేరుగా నిర్ణయం తీసుకుని పోస్టింగ్స్ వేయించుకున్నారట… ఈ పరిణామాలతో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన బూచేపల్లి అవాక్కవుతున్నారట… రెండు నెలల్లోనే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో వచ్చిన మార్పు చూసి అనుచరుల వద్ద బూచేపల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట..

ఆ రెండు నియోజక వర్గాల్లో పరిస్థితులపై పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ వద్ద బూచేపల్లి పంచాయితీ పెట్టారట… ఆ ఎఫెక్ట్‌తో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయట… విజయానికి అన్ని విధాలా సహకరించిన బూచేపల్లిని సమన్వయం చేసుకుని పని చేయాలంటూ ఎమ్మెల్యేలకు మౌఖిక ఆదేశాలు వచ్చాయట… బూచేపల్లి ఫిర్యాదుపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించడంతో … ఎమ్మెల్యేలు బూచేపల్లిని తిరిగి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది. .. మరి మున్ముందు ఆ రెండు సెగ్మెంట్లలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చూడాలి…