Home News

ఆ అధికారులనే టార్గెట్ చేసిన జగన్ సర్కార్…!

SHARE

విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎవరి మీద ఆరోపణలు చేశారో.. వారిని ఇప్పుడు టార్గెట్‌ చేసుకున్నారా..? ఏ మాత్రం వదలకుండా వెంటపడి మరీ వేటాడేందుకు సిద్దమవుతున్నారా అన్న టాక్ ఇప్పుడు సచివాలయ కేంద్రంగా నడుస్తుంది. గత ప్రభుత్వంలో సదురు అధికారులు చేసిన తప్పులను ఎత్తిచూపడంతోపాటు.. తెర వెనుక ఉన్న పెద్దలను కూడా ముగ్గులోకి దించే దిశగా తీవ్రమైన కసరత్తే చేస్తుందట జగన్ హర్డ్ కోర్ టీం…

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు చూస్తుంటే కూడా ఈ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వ్యవహరాలపై కెబినెట్‌ సబ్‌ కమిటీ వేసిన సీఎం జగన్.. వాటికి సంబంధించి 45 రోజుల్లోనే నివేదిక కావలని కోరినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జీఏడీకి బదిలీ అయిన గత ప్రభుత్వంలోని కీలక అధికారులకు ఎటువంటి పోస్టింగులు ఇవ్వని వ్యవహరం చూస్తుంటే దీని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లే అర్ధమవుతుంది.

మాజీ సీఎం చంద్రబాబు పేషీలో పని చేసిన వారిలో గిరిజా శంకర్‌ మినహా మిగిలిన వారెవ్వరికి పోస్టింగులు ఇవ్వలేదు. ఇలా పోస్టింగులు ఇవ్వకుండా మిగిలిన పోయిన వారిలో ఒకరిద్దరి మీద ఎటువంటి ఆరోపణలు లేకున్నా.. అటు రాజకీయ వ్యవహారాలతోపాటు.. ఇటు వేరే వ్యవహరాలు చూసేవారని పేరు తెచ్చుకున్న ఓ ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు మాత్రం కొత్త సర్కార్‌ టార్గెట్‌లో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇక ఏపీఎండీసీ వీసీఎండీగా విధులు నిర్వహిస్తూ.. ప్రస్తుతం జీఏడీకే పరిమితమైన అంకయ్య చౌదరిని కొంత కాలం క్రితం మాతృ సంస్థకు రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగన్ సర్కార్. అయితే వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకుంది. గతంలో ఏపీఎండీసీ వ్యవహరాలకు సంబంధించి అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పైగా ప్రస్తుతం జగన్‌ సర్కార్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి….అతని తనయుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారనే చర్చ జరుగుతోంది. గనుల శాఖలో గత ప్రభుత్వంలో అవినీతిని లెక్క తేల్చేంత వరకు అంకయ్య చౌదరిని మాతృ సంస్థకు రిలీవ్‌ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే జీవోను వెనక్కు తీసుకున్నారనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.

జీఏడీకి బదిలీ అయినా గోపీనాధ్‌ మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడుకు స్వయానా అల్లుడు. మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఎండీగా గత ప్రభుత్వంలో పని చేసిన సమయంలో ఆ సంస్థలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనేది సదురు అధికారి మీద ఆరోపణ. ఈ క్రమంలో గోపీనాధ్‌ను జీఏడీకి బదిలీ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది.ఏది ఏమైన గతంలో ప్రతిపక్షంలో ఉండగా తమను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఓ పట్టు పట్టాలనే దిశగానే జగన్‌ సర్కార్‌ పంతంతో ఉన్నట్టు కన్పిస్తోంది.